పుష్ప అప్ డేట్..ఊర మాస్​ ​గా సునీల్​ లుక్

Floral update..Sunil look as a village mass

0
114

ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ పాత్ర‌ల‌తో పాటు హీరోగాను న‌టించి అల‌రించిన సునీల్ తొలి సారి పుష్ప కోసం విల‌న్‌గా మారాడు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప చిత్రంలో సునీల్ మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో సునీల్ నుదుటన బొట్టు, మెడలో చైన్​లు,​ చేతిలో పాత మొబైల్​ ఫోన్​, ఎరుపెక్కిన కళ్లతో ఉన్న ఆయన సీరియస్​ లుక్​ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఈ పోస్టర్​ చూసిన నెటిజన్లు “వామ్మో.. సునీల్‌ భయ్యా.. ఏంటి ఇది..!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇప్పటికే  దాక్కొదాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగారీసెంట్‌గావిడుద‌లైన‌ మూడో సింగిల్ ” సామి సామి ” కూడా ర‌చ్చర‌చ్చ చేసింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు.