యాంకర్ అనసూయ..అందం..అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది. రంగమ్మత్త పాత్రతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ యాంకరమ్మ.. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ది రైజ్ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ బయటికి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్..ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు.
నోట్లో ఆకు నములుతూ..చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్.