భీమ్లానాయక్ అప్ డేట్..‘అడవి తల్లి మాట’ పాట రిలీజ్

Fourth single from Bhimlanayak .. ‘Adavi Talli Mata’ song release

0
105

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్.. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తుంది ఈ సినిమా.

ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ఏ చిన్న అప్డేట్ అయ్యిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నాలుగో సింగిల్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. భీమ్లానాయక్ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.

తాజాగా విడుదల చేసిన నాలుగో పాట అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది. సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి పాడగా రామజోగయ్య శాస్ట్రీ లిరిక్స్ , మ్యూజిక్ తమన్ ఇచ్చారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. ఈ సినిమా పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది.

https://www.youtube.com/watch?v=9WEvXJ8y2n8&t=90s