వర్మ గారితో నా తొలి అనుభవం ఇదే..!!

వర్మ గారితో నా తొలి అనుభవం ఇదే..!!

0
108

గాయత్రి గుప్తా ఫిదా సినిమాలో సాయిపల్లవి స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె పలు కథనాలతో మీడియా ముందుకు వచ్చారు. సినిమా ఇండ్రస్టీలో ఆడవాళ్ళకు జరుగుతున్న ఇబ్భందులపై గళమెత్తారు. దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి రేప్ వంటి విషయాల గురించి మరియు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి చాటింగ్ కామెంట్ చేశారు. గతంలో కూడా ఇండస్ట్రీ లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మరియు ఇంకా అనేక వాటి విషయాల గురించి గాయత్రీ గుప్త చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పట్లో తెలుగు మీడియా చానల్స్ లో హీటెక్కించిన విషయం ఇప్పటికే అందరికీ గుర్తే.

గాయత్రి తాజాగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటిస్తోంది. తనకు రామ్ గోపాల్ వర్మతో పని చేసే అవకాశం ఎలా వచ్చిందో వివరించింది గాయత్రి.. వర్మ దగ్గర పనిచేసే ఓ కెమేరా మెన్ గాయత్రి ఫ్రెండ్ అని చెప్పింది. ఇలా ఓ సినిమా ఛాన్స్ ఉందని తెలియగానే తన ఫ్రెండ్ కు చెప్పిందట. వర్మ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పావుగంటలో వచ్చేయాలని చెప్పారట.

అంతే హడావిడిగా వర్మ ఆఫీసుకు వెళ్లి ఆయన్ను కలిసిందట గాయత్రి.. ఆయన కొద్ది సేపు మాట్లాడి.. ఓకే.. రేపటి నుంచి షూటింగ్ ఇదే డ్రస్సులో వచ్చేయాలని చెప్పేశారట. ఆర్జీవీ వంటి పెద్ద డైరెక్టర్ అలా నిమిషాల్లో తేల్చేయం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని గాయత్రి వివరించింది.