విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని తట్టుకోగలనా?

విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని తట్టుకోగలనా?

0
72

విజయ్ దేవరకొండ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు గుర్తుకు వస్తాయి. అంతగా జనాలను ఆకట్టుకున్నాయి ఆ సినిమాలు. ఇక అసలు విషయానికి వస్తె తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు. ఈమె త్వరలోనే తెలుగు వెండితెరపై కూడా కనిపించనుంది. యవ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్యా రాజేశ్ నటించనుంది. వీరిద్దరు కలిశారో లేదొ అప్పుడే అయితే, విజయ్ దేవరకొండతో ఐశ్వర్యా రాజేశ్ ప్రేమలో పడినట్టు వార్తలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.

వీటిపై ఈ హీరోయిన్ స్పందించింది. “నాకు ఒక ప్రేమకథ ఉందని, నేను ప్రేమలో ఉన్నాననే వార్తలను గత కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం తెలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేసింది. నేను నిజంగానే ఎవరి నైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెపుతానని, అనవసరంగా పుకార్లను చేయకండని” ఆమె కోరారు. అంతే కాదు విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుని తట్టుకోగలనా అని ఎదురు ప్రశ వేసింది ఈ అమ్మడు.