త్రివిక్రమ్, బన్నీ సినిమా మధ్యలో ఆగిపోనుందా.. నిర్మాతతో పడట్లేదట..!!

త్రివిక్రమ్, బన్నీ సినిమా మధ్యలో ఆగిపోనుందా.. నిర్మాతతో పడట్లేదట..!!

0
54

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే..న్ని రోజుల క్రితమే బన్నీ త్రివిక్రమ్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, బన్నీ సినిమాపై వస్తున్న రూమర్స్ అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నాయి..

సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ లోనే బన్నీ-త్రివిక్రమ్ మధ్య కంటెంట్ పరంగా చర్చలు సరిగ్గా సాగలేదని… అలానే బన్నీ – హారిక హాసిని నిర్మాతల మధ్య కూడా సంబంధాలు పెద్దగా లేనట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో రూమర్ ఏంటంటే… లెక్క ప్రకారం ఈ మూవీ రెండో షెడ్యూల్ నిన్నటి నుండి లేదా ఈరోజు అన్న స్టార్ట్ కావాలి కానీ స్టార్ట్ కాలేదు. ఫస్ట్ షెడ్యూల్ టైంలో అల్లు అరవింద్, బన్నీ, మరికొంతమంది ఓ గ్రూప్ గా.. నిర్మాతలు, త్రివిక్రమ్, ఇంకొంతమంది వేరే గ్రూప్ గా ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇలా అయితే ఈ సినిమా పూర్తయ్యేనా అని అభిమానులు కలవరపడుతున్నారు..