ముచ్చటగా మూడోసారి ఆ దర్శకుడితో రామ్..!!

ముచ్చటగా మూడోసారి ఆ దర్శకుడితో రామ్..!!

0
84

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత రామ్ సినిమా కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.. గతంలో రామ్‌ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్‌ తిరుమల ఇప్పుడు మూడోసారి ఈ సినిమా చేయడం విశేషం..

వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా సూపర్ హిట్ అయినా రెండో సినిమా ఫ్లాప్ గా మిగిలింది.. అయితే ఈసారి కిషోర్ తిరుమల సొంత కథ కాకుండా ఓ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కిషోర్ తిరుమల డైలాగులు కోసం అడిగి, డైరక్షన్ అప్పచెప్పినట్లు తెలుస్తోంది. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. జులై లో ఈ సినిమా లాంచ్ అయ్యి, రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.