వకీల్ సాబ్ సినిమా తర్వాత నివేథా థామస్ కు మరో బంపర్ ఆఫర్

0
114

వకీల్సాబ్ సినిమా తర్వాత హీరోయిన్ నివేథా థామస్ కు ఓ సూపర్ ఆఫర్ వచ్చింది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.. ఈ సినిమాలో ఆమె రోల్ కి మంచి పేరు వచ్చింది,నివేథా సినిమా ఎంట్రీ చూస్తే నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్ మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ..

నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది… తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఓ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది, అయితే ఆమెని పలువురు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారట.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నివేథా నటించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి… ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ఓ హీరోయిన్ గా ఆమె పేరుని పరిశీలిస్తున్నారు అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.