త్రివిక్రమ్ – పవన్ కల్యాణ్ టాలీవుడ్ చిత్ర సీమలో మంచి మిత్రులుగా ఎంతో పేరు ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే .జల్సా ,అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరి కాంబోలో సినిమా అనౌన్స్ చేస్తే అభిమానులు ఎంతో ఆనందంతో ఉంటారు. ఈ ఇద్దరి కలయికలో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టాలీవుడ్ టాక్ చూస్తే త్రివిక్రమ్ తో పవన్ మరో రెండు సంవత్సరాల్లో సినిమా చేస్తారట. అయితే ఇప్పుడు ఉన్న అన్నీ చిత్రాలు పూర్తి అయిన తర్వాత, పవన్ కల్యాణ్ -త్రివిక్రమ్ ఈసారి పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
దర్శకులు క్రిష్ – సాగర్ చంద్ర ప్రాజెక్టులతో పవన్ బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా త్రివిక్రమ్ పవన్ సినిమా ఉండచ్చు అని టాక్ నడుస్తోంది. ఇది తొందరగా జరగాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.