బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్..

Good news for childhood fans ..

0
119

బాలయ్య ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ‘అఖండ’ ట్రైలర్ రిలీజ్ డేట్​ను ప్రకటించారు చిత్రబృందం. నవంబరు 14న విడుదల చేస్తున్నట్లు కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అఖండ’ రోర్, టైటిల్​ సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్​ గెటప్స్​లో కనిపించనున్నారు. అందులో అఘోరా రోల్​ కూడా ఉండటం విశేషం. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

సినిమాలే కాకుండా ఓటీటీలోనూ ‘అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే’ షోలో హోస్ట్​గా బాలయ్య చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్​లు.. అభిమానుల్ని అలరిస్తున్నాయి. తొలి ఎపిసోడ్​కు మోహన్​బాబు, రెండో ఎపిసోడ్​కు నాని అతిథులుగా వచ్చారు. మరోవైపు బాలయ్య కొత్త సినిమా శనివారమే లాంఛనంగా ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటిస్తోంది.