‘లైగర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆరోజే ఓటిటిలో సందడి..స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?

0
121

టాలీవుడ్ యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘లైగర్’ సాలా క్రాస్ బీడ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించగా..అనన్య పాండే విజయ్ సరసన నటించింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ రాజమాత రమ్యకృష్ణ విజయ్ తల్లిగా నటించింది. మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు.

ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో ఆగష్టు 25న రిలీజ్ అయింది. కానీ లైగర్ ఇటు పూరి, ఆ విజయ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం, విజయ్ నటన, అనన్య అందాలతో ఆ మాత్రం నెట్టుకొచ్చారు. ఇక తాజాగా ఓటిటి లైగర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ సినిమా ఓటిటి రైట్స్ ను ప్రముఖ సంస్థ డిస్ని+హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో 2 రోజుల్లో అంటే సెప్టెంబర్ 22న ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.