మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్రివిక్రమ్ సినిమా బిగ్ అప్డేట్

0
112

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” మే 12న థియేటర్లలో విడుదలయి మహేష్ ఫాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహించగా..ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల వంటి స్టార్స్ తో పని చేయాల్సి ఉంది. అయితే ఇందులో ఏది ముందు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే తాజాగా త్రివిక్రమ్ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది.

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా తరువాత మూడో సినిమాగా రాబోతుంది. ఇది మహేష్ కెరీర్ లో 28వ సినిమా. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హేగ్దే రొమాన్స్ చేయనుంది. ఈ సినిమా 2023 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

https://twitter.com/haarikahassine