మెగా ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్..యూత్​ఫుల్ డైరెక్టర్​తో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్

Good news for mega fans..Chiranjeevi's new project with Youthful Director

0
100
Ram charan upasana

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తుండగా..తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి యూత్​ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు.

ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంగా ‘ఆచార్య’లో నటిస్తోన్న చిరు.. తన 153వ సినిమాగా రానున్న లూసిఫర్‌ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని నెలల కిందట ప్రారంభమైంది. ఇక మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా చిత్రీకరణ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది.