నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఓటిటిలోకి బింబిసార..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

0
125

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అయ్యారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.

సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమా ఆగష్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.

ఇక తాజాగా ఓటిటి అభిమానులకు బింబిసార టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ హక్కులను ” జి 5″ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొత్తగా పెట్టుకున్న నిబంధనల ప్రకారం 50 రోజుల తర్వాత ఈ సినిమా ” జి 5″ ఓటీటి ద్వారా స్ట్రీమింగ్ కానుంది.