ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’సలార్’ మూవీ నుండి బిగ్ అనౌన్స్ మెంట్

0
119

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కెజిఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. ఎంతోకాలంగా ఈ సినిమా నుండి అభిమానులు నిరాశ చెందగా తాజాగా ఫ్యాన్స్ ను చిత్రబృందం అప్డేట్ తో ఖుషి చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. సెప్టెంబర్ 28, 2023న సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మైనింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ విలన్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. `కేజీఎఫ్‌ `తో సంచలనాలు క్రియేట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘సలార్’పై భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

కాగా ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ సలార్ తో పాటు, ఆదిపురుష్, సందీప్ వంగాతో మరో సినిమా, మారుతితో ఓ సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.