తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పులలో పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ప్రసంగిస్తుండగా ఓ టీఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.
దీనికి బదులుగా బండి సంజయ్ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించాడు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని టీఆర్ఎస్ నాయకుడు తిరిగి ప్రశ్నించాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళకు మా పాదయాత్ర తెలుసుగా.. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా..సీపీ ఏం చేస్తున్నాడంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు.