ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్

0
111

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఆదిపురుష్, సలార్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సందీప్ వంగతో స్పిరిట్ సినిమా పట్టాలెక్కనుంది. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో స్క్రీన్ పై ప్రభాస్‏ను ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

అయితే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే RRR, బీమ్లానాయక్, ఆచార్య సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా అదే బాటలో రాధేశ్యామ్ నడవనుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలో సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లుగా డైరెక్టర్ రాధాకృష్ణ పలుమార్లు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.