అభిమానులకు గుడ్ న్యూస్..నేడే పెళ్లిపీటలెక్కనున్న లేడీ సూపర్ స్టార్

0
100

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. వీరికి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి అడుగులు వేయడానికి విగ్నేష్‌ శివన్‌, నయనతార సిద్ధంగా ఉన్నారు. మనందరం ఎదురు చుసిన విధంగానే వీరిరువురి పెళ్లి నేడు జరగబోతుంది. దాంతో ఇటు విగ్నేష్‌ శివన్‌ అభిమానులు, అటు నయనతార ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

నేడు మహాబలిపురంలో నయన్, విగ్నేష్ ల వివాహం నేపథ్యంలో దర్శకుడు విగ్నేష్ శివన్ సంచలన పోస్ట్‌ చేశాడు. “ఈ రోజు జూన్‌ 9వ తేదీ. ఇది నయన్‌ దే. నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన భగవంతుడికి, ఈ విశ్వానికి, నా జీవితంలో మంచి మనుషులు అందరికీ.. ప్రతి ఒక్క మంచి మనసుకు, ప్రతి ఒక్కరి ఆశీర్వాదానికి, షూటింగ్ లో ప్రతి రోజుకు థ్యాంక్యూ. మీ ప్రార్థనలకు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఇదంతా లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌. నయన తారకు అంకితం ఇస్తున్నాను. ” అని విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్నారు.