గుడ్ న్యూస్..ఓటిటిలోకి కార్తికేయ-2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

0
122

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా కార్తికేయ 2ను రూపొందించారు.  ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​ గా నటించింది.

ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యి కలెక్షన్లు కురిపిస్తుంది. ఇక తాజాగా ఓటిటి ఫ్యాన్స్ కు కార్తికేయ-2 గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ.. కార్తికేయ2 డిజిటల్ రైట్స్‌ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ సినిమా ఈ నెల 30 వ తేదీన ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.