మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

0
105

టాలీవుడ్ అందగాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ ఈ చిత్రం నుండి మరో అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుండి ఫస్ట్ పాట ని మార్చి 29న విడుదల చేస్తామని మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. అప్పటివరకు ఈ క్యూట్‌ జూనియర్స్‌ ల వీడియోను ఎంజాయ్‌ చేయండంటూ మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యా, మహేష్ బాబు కూతురు సితారలు తనకు డాన్స్‌ నేర్పిస్తున్నారంటూ వీడియో షేర్‌ చేశాడు.

చాలా రోజుల తర్వాత మహర్షి నుంచి పెద్ద అప్‌డేట్‌ రావడంతో అభిమానులకు చాల అందం గా ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దిల్‌రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లరినరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.