ఇక రైల్ ప్రయాణంలో ఈ పని చేస్తే ఇక మీ పని అంతే

ఇక రైల్ ప్రయాణంలో ఈ పని చేస్తే ఇక మీ పని అంతే

0
39

మనం బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేసే సమయంలో చాలా మంది ఫుట్ బోర్డ్ దగ్గర నిలబడతారు అలాగే చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, లోపల 10 మంది పట్టే ప్లేస్ ఉన్నా అక్కడే వేలాడతారు,ఇవి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. అయితే ఎవరి పని వారిది.. డ్రైవర్ల పని డ్రైవర్లది అనేలా ఉంటుంది.

ఇక మాత్రం రైళ్లో ఫుట్బోర్డింగ్ చేస్తామంటే మీకు కుదరదు అవును .. అక్కడ ఉండే కుక్క మీమల్ని వదిలిపెట్టదు. లోపలికి వెళ్లే వరకు వెంటాడుతుంది. ఏమిటి అర్ధం కాలేదా.

చెన్నైలోని పార్క్టౌన్ రైల్వేస్టేషన్లో ఉన్న ఆ కుక్క పేరు చిన్నపొన్ను. కొన్ని రోజుల క్రితం అది రైల్వే స్టేషన్లో కనిపించిందట. దీనికి పోలీసులు అక్కడ సిబ్బంది రోజూ ఆహరం పెడుతున్నారు.. వారు రోజూ రైల్వే ఫుట్ బోర్డుల పై ఉండేవారిని లోపలకి పంపుతారు ఇది వారిని చూసి అలా ఎవరైనా ప్రమాణం చేస్తే, వారిపై అరుస్తుంది. లోపలికి వళ్లేవరకు అరుస్తుంది.. దీంతో అది మాకు బాగా సాయం చేస్తోంది అంటున్నారు అక్కడ పోలీసులు రైల్వే సిబ్బంది.