తండ్రి పై ప్రేమతో ఈ కూతురు చేసిన పనికి నమస్కారం చేయాలి

తండ్రి పై ప్రేమతో ఈ కూతురు చేసిన పనికి నమస్కారం చేయాలి

0
46

దేశంలో దాదాపు 45 రోజులుగా లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో పని లేక ఉపాధి లేక అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు, సొంత గ్రామాల నుంచి వలస వెళ్లి వేరే చోట కూలీ పని చేసుకునే వారు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు, రెండో దశ లాక్ డౌన్ నుంచి వారు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు నడక మార్గం ఎంచుకున్నారు.

ఇలా వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తే కన్నీరు రాకమానదు, ఈ సమయంలో బీహార్ కి చెందిన ఒక బాలిక తన తండ్రిని ఎక్కించుకుని వెయ్యి కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. మోహన్ పాస్వాన్ ది బీహార్ లోని దర్బంగ. తను హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం లో పని చేసుకుంటున్నాడు, ఈ లాక్ డౌన్ తో ఉపాధి లేదు, మోహన్ కు ఆరోగ్యం కూడా క్షీణించింది.

దీంతో ఇంటి ఓనర్ కూడా అద్దె ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు, ఇక చేతిలో ఉన్న 500 రూపాయలతో పప్పు బియ్యం తీసుకురమ్మని తండ్రి కుమార్తె జ్యోతికి చెప్పాడు, కాని ఆమె 500 తో పాత సైకిల్ కొని తెచ్చింది, దానిపై తండ్రిని ఎక్కించుకుని తన సొంత ఇంటికి పయనం అయింది. చివరకు తమ సొంత గ్రామం చేరుకుంది, ఆమె దైర్యానికి అందరూ మెచ్చుకున్నారు, ఆమె వయసు 13 సంవత్సరాలు. నిజంగా గ్రేట్ కదా.