హ‌లీం ప్రియుల‌కి ఓ బ్యాడ్ న్యూస్

హ‌లీం ప్రియుల‌కి ఓ బ్యాడ్ న్యూస్

0
43

హ‌లీం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అయితే రంజాన్ మాసంలో ఈ హ‌లీం ఎక్కువ‌గా త‌యారు చేస్తారు, ఈ స‌మ‌యంలో అంద‌రూ ఇష్టంగా హ‌లీం తింటారు. మ‌రి ఈ ఏడాది ఈ వైర‌స్ కార‌ణంగా హ‌లీం దొరుకుతుందా లేదా అనేది చాలా మంది ఆలోచ‌న చేస్తున్నారు.

తాజాగా హలీం తినాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా ఏ హోటల్ లోనూ హలీం తయారు చేయరాదని హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈనెల 25 నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది, కాని ఇక హ‌లీం మాత్రం దొర‌క‌దు అని తెలుస్తోంది.

చికెన్, మటన్, వెజ్ హలీమ్‌లను లొట్టలేసుకుంటూ తినేవారు ఇప్పుడు అయ్యో అంటున్నారు.
ఇక రంజాన్ నెల స‌మ‌యంలో హైద‌రాబాద్ లో ఎక్కువ‌గా . హలీం, ఖుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, దహీవడ ఎక్కువ‌గా తీసుకుంటారు, ఇక చాలా మంది ఇవి ఈ ఏడాది దొర‌క‌వు అంటున్నారు, హ‌లీం ప్రియులు ఈ ఏడాది విటీని బాగా మిస్ అయిన‌ట్టే