రూపాయికి చికెన్ బిర్యానీ తిన్నా తర్వాత ఏమైందంటే

రూపాయికి చికెన్ బిర్యానీ తిన్నా తర్వాత ఏమైందంటే

0
64

ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ తినాలి అంటేనే భయపడిపోతున్నారు జనం.. ఓ పక్క చికెన్ తింటే కరోనా రాదు అని చెబుతున్నా, ప్రజలు నమ్మడం లేదు. కొన్ని రోజులు నాన్ వెజ్ కు దూరం ఉంటే బెటర్ అని చెబుతున్నారు.. ఇక మార్కెట్లో గుడ్డు కూడా బాగా రేటు తగ్గిపోయింది.. అందుకే చాలా మంది చికెన్ కిలో 20 కి కూడా అమ్మేస్తున్నారు, ఎందుకు అంటే ఇలా కోళ్లను పెంచాలి అన్నా వాటికి దాణా పెట్టాలి అన్నా వేలు ఖర్చు అవుతోంది.

అందకే వాటిని అమ్మేసి ఏదో కొంత సొమ్ము చేసుకుంటున్నారు.. రెండు వందలు ఉండే చికెన్ ఏకంగా 20 కి ధర పడిపోయింది, అందుకే ఆఫర్లు ఇస్తూ మరీ చికెన్ అమ్ముతున్నారు వ్యాపారులు.. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా భయాన్ని పక్కనపెట్టేసి అందినంత చికెన్ బిర్యానీ లాగించారు.

ఎందుకో తెలుసా, ఇక్కడ హోటల్ ప్రారంభించారు అందుకే ప్రారంభ ఆఫర్ గా చికెన్ బిర్యానీ రూపాయికి అందిస్తున్నారు.
అంతే జనాలు విరగబడిపోయారు. బిర్యానీని దక్కించుకునేందుకు బారులుతీరారు. వారిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం రెండు గంటల్లో 200 కిలోల చికెన్ బిర్యానీ అమ్మేశారు.. మొత్తానికి వారికి వచ్చింది 400 రూపాయలట, రోజూ ఆఫర్ ఉండదు కేవలం ఈరోజు మాత్రమే అని బోర్డు పెట్టారు.