వెయ్యి మందితో అంగరంగా వైభవంగా పెళ్లి… ఇంకేముంది కరోనా అటాక్…

వెయ్యి మందితో అంగరంగా వైభవంగా పెళ్లి... ఇంకేముంది కరోనా అటాక్...

0
35

పెళ్లిళ్లకంటూ ఒక సీజన్ ఉంటుంది కానీ ఈ మయదారి మహమ్మారి కరోనాకి సీజన్ లేకుండా పోయింది… ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అటాక్ చేస్తానంటూ పెళ్లి పందిట్లోనే కాచుక్కూర్చుంటోంది… పెళ్లి చేసుకున్న వరుడు వధువు తండ్రి తాత ఇలా వరుసబెట్టి 16 మందికి కరోనా అంటుకుంది.. అసలే ఆ వివాహ వేడుకలకు వెయ్యి మంది హాజరుఅయ్యారు..

ఇంకేముంది కరోనా వచ్చి ఉంటుందిని అధికారులు ఆందోళన చెందుకుతున్నారు… రాజస్థాన్ బిల్వాడా జిల్లా భడాడాప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త వైభవంగా ఇటీవలే తన కుమారుడి వివాహం జరిపించాడు…పెళ్లి ముందు అధికారుల దగ్గరకు వెళ్లి పర్మీషన్ కూడా తీసుకున్నాడు.. 50 మంది అతిధుల్ని పిలుస్తాను అందరికీ మాస్కులు శానిటైజర్ సప్లై చేస్తాను భౌతిక దూరం పాటించేలా చూస్తానని అనుమతి తీసుకున్నాడు…

అయితే అందులో ఒక్కటి పాటించకుండా ఏకంగా వెయ్యి మందిని ఆహ్వానించాడు… ఆ సమయంలో అందరూ కరోనాముచ్చట్లే మరిచిపోయారు… వేడుకల తర్వాత కొందరు అస్వస్థతకు గురి కాగా వారికి కరోనా టెస్టులు చేశారు… దీంతో పాజిటివ్ అని తేలింది.. వరుడు తాత చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు..