Hanuman | ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. 25 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?

-

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్(Hanuman)’చిత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సూపర్ హిట్ అందుకుని అభిమానులను అలరించింది. ముఖ్యంగా మూవీలోని గ్రాఫిక్స్, విజువల్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో థియేటర్లన్ని జైశ్రీరామ్(Jai Sriram) నినాదాలతో మార్మోగాయి. తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో మూవీకి ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి.

- Advertisement -

ఇప్పటికే రూ.250కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మూవీ విడుదలై 25 రోజులు అవుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు రాబట్టినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్(Hanuman)’ నెల రోజులు కూడా అవ్వకుండా రూ.300కోట్లు వసూలు చేయడం సరికొత్త రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. కాగా ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో గత 92 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు క్యూకట్టడంతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Read Also: ఏపీ అసెంబ్లీలో రచ్చ.. టీడీపీ సభ్యులు సస్పెన్షన్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...