తాజాగా టాలీవుడ్ లో కోడి కత్తి టైటిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. గతంలో ప్రస్తుత సీఎం జగన్ పై విశాఖలో జరిగిన దాడి సమయంలో కొందరు కోడికత్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కొన్ని మీడియాలు ఇష్టం వచ్చిన రీతిన చర్చలు పెట్టాయి ఇలా వార్తలు వదిలాయి.
అయితే తాజాగా ఈ సినిమా అదే నేపథ్యంలో ఎక్కుతుందా లేదా టైటిల్ వాడుతున్నారా అనేదానిపై చర్చ జరుగుతోంది.. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ టైటిల్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే టాలీవుడ్ లో వార్తల ప్రకారం ఇది సాధారణ థ్రిల్లర్ సినిమా అని , ఈజానర్ చిత్రానికి ఈ టైటిల్ పెట్టారు అని అంటున్నారు.
కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ కథ చిత్రం అంతా ఆనాటి సంఘటనల ప్రకారం ఉంటుంది అని చర్చ జరుగుతోంది.. కాని టీడీపీ వైసీపీ అభిమానులు దీనిపై కామెంట్లు పెడుతున్నారు.. అయితే అసలు ఈ కథ దేనిపై తీస్తున్నారు అంటే అసలు పొలిటికల్ ఫైట్ కు సంబంధించింది కాదు అంటున్నారు చిత్రయూనిట్ అని వార్తలు వస్తున్నాయి.