హీరో భానుచందర్ రియల్ స్టోరీ

హీరో భానుచందర్ రియల్ స్టోరీ

0
37

భానుచందర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు.. ఆయన నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది..తెలుగు, తమిళ చిత్రాలలో కూడా ఆయన నటించారు, ఇక ఆయన గురించి చూస్తే తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు భానుచందర్ . తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించారు భానుచందర్.

మద్దూరి భానుచందర్ 1952 జులై 2 న మద్రాసులో జన్మించారు…తండ్రిని చూస్తు పెరిగిన భానుచందర్ చిన్నతనంలో తండ్రిలానే తానూ సంగీత దర్శకుడు కావాలనుకున్నాడు. గిటార్ నేర్చుకుని అవలీలగా వాయించగలిగేవాడు. తర్వాత నటుడు అయ్యారు, ఆయన నేషనల్ లా కాలేజీ నుంచి గ్రాడ్యుయేటన్ కంప్లీట్ చేశారు, కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. ఈ సమయంలో ఆయన తల్లి నువ్వు నటుడు అవ్వాలి అని చెప్పింది.

దీంతో ఆయన సినిమా యాక్టింగ్ స్కూల్లో చేరారు, ఆయన ముందు బ్యాచ్ లో చిరంజీవి రజనీకాంత్ కూడా ఉండేవారు, ఇలా సినిమాల్లో వచ్చారు, అంతేకాదు ఆయన మార్షల్ ఆర్ట్స్ కరాటే కూడా నేర్చుకున్నారు…ఇలా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.
ముందుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన మూడుపాని అనే తమిళ సినిమాలో నటించాడు.

తరువాత తమిళంలోనే నీంగళ్ కేటవాయ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో తరువాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా సినిమాల్లో నటించాడు. అంతేకాదు ఆయన నటించిన వీడు అనే తమిళ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది.

ఆయన నటించిన చిత్రాలు చూద్దాం
హిట్
మనసారా
దుబాయ్ శీను
ఎవడైతే నాకేంటి?
స్టైల్
దేవి
సింహాద్రి
నిరీక్షణ
మెరుపు దాడి
ఉదయం
స్వాతి
మంచి మనుషులు
సూత్రధారులు
గూఢచారి నెం.1
అశ్వని