ఎవరు మీలో కోటీశ్వరులు తొలి ఎపిసోడ్ కు ఆ హీరో రానున్నారా ? బుల్లితెర టాక్

ఈ షో కోసం ఆయన అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.

0
46

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ సిద్దం అవుతోంది. షూటింగ్ కూడా పూర్తి అవుతోంది. అయితే బుల్లితెరలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం ఆయన అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా బుల్లితెర వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అభిమానులు త్వరలో ఈ బుల్లితెర కార్యక్రమంలోనూ చూడనున్నారట‌. జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ప్రారంభ ఎపిసోడ్ కు భారీగా ప్లాన్ చేస్తున్నారట.

జెమిని టీవీ చానల్లో ప్రసారం కానుంది ఈ షో. ఈ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ కు గెస్టుగా రామ్ చరణ్ వస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఇద్దరు చేస్తున్నారు. ఇక ఇద్దరిని వెండితెరపైనే కాదు ఇటు బుల్లితెరలో ముందు చూడబోతున్నాము అని అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు. చూడాలి మరి దీనిపై ప్రకటన ఏమైనా వస్తుందా అనేది.