హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ లో వధువు ఎవరో తెలుసా

హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ లో వధువు ఎవరో తెలుసా

0
105

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లలో ఒకరు నితిన్, పెళ్లి మాట ఎత్తితే ఆయన కూడా టాపిక్ డైవర్ట్ చేస్తారు, అయితే ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లే, తాజాగా ఆయనకు పెళ్లి నిశ్చయం అయింది అని తెలుస్తోంది.. కాని ఈ విషయం మాత్రం బయటకు పొక్కకుండా కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

సినిమా ఫ్యామిలీలతో సంబంధం లేని, సంప్రదాయ రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఆ అమ్మాయి డాక్టర్ అని తెలుస్తోంది. ఇక ఆయన వివాహం దుబాయ్ లో చేయాలి అని కుటుంబం భావిస్తోందట.నితిన్ తండ్రి సుధాకరరెడ్డి కేవలం తన సర్కిల్ లో కొందరికి మాత్రమే ఈ విషయం తెలియచేశారట. అందుకే వధువు వివరాలు ఇంకా బయటకు రాకుండా వుంచారు.

అయితే ఆయన వివాహం ఏప్రిల్ లో వచ్చే ఏడాది ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. తాజాగా నితిన్ కూడా తన కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టారు. ప్రస్తుతం రష్మిక తో కలిసి భీష్మ సినిమా చేస్తున్నారు. తరువాత వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా వుంది. మరో రెండు సినిమాలు డిస్కషన్ లో ఉన్నాయి, మరో రీమేక్ కూడా చేయబోతున్నారు, మొత్తం వచ్చే ఏడాదికి తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.