రేషన్ కార్డులపై కేంద్రం సంచలన నిర్ణయం మీకురేషన్ వస్తోందా ఇది చదవండి

రేషన్ కార్డులపై కేంద్రం సంచలన నిర్ణయం మీకురేషన్ వస్తోందా ఇది చదవండి

0
34

దేశంలో రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.. మన దేశంలో ఎవరు ఎక్కడ నుంచి అయినా రేషన్ తీసుకునే విధానం అమలులోకి తీసుకువచ్చారు. అలాగే పలు మార్పులు కూడా తీసుకువచ్చింది కొత్త లబ్దిదారులకి.. గ్రామాల్లో వార్షిక ఆదాయం లక్షా 20 వేలు, పట్టణాల్లో వార్షిక ఆదాయం లక్షా 44 వేల రూపాయలు లోపు ఉన్నవారు అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. నాలుగు చక్రాల వాహానాలు ఉన్నవారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయింపు ఇచ్చారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే పారిశుధ్య కార్మికులను బీపీఎల్ కోటా కింద పరిగణించేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… అయితే తాజాగా అప్లై చేసుకున్నవారికి సంబంధించి జాబితాని కూడా ప్రచురించారు,
వీరి జాబితాలని గ్రామ సచివాలయాల్లో మూడు రోజుల పాటు ఉంచనున్నారు.. శుక్ర , శని ఆదివారాలు అక్కడ డేటా అందరికి కనిపించేలా నోటీస్ బోర్డులో ఉంచుతారు, ఇందులో మీ డేటా సరిచూసుకోండి.

ఇక జాబితాలో మీ పేరు లేకపోతే దీనికి సంబంధించి వాలంటీర్ కి మీ వివరాలు ఇచ్చి దాని ప్రకారం రేషన్ కార్డుకు మళ్లీ అప్లై చేసుకోవచ్చు. దీనిలో మీరు ఇచ్చే డేటా ప్రకారం మీకు రేషన్ కార్డు వస్తుంది లేకపోతే కొత్త రేషన్ కార్డు రాదు, అలాగే నవశకం పథకంలో భాగంగా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం రేషన్ కార్డులు కొనసాగింపు జరుగుతుంది అంటున్నారు.
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పించన్లు పొందేవారికి కూడా ఈ రేషన్ కార్డుని తొలగించారు.

మీకు కారు ఉన్నా రేషన్ కార్డు తొలగిస్తారు. అలాగే 300 యూనిట్ల కరెంట్ కంటే ఎక్కువ యూనిట్లు మీరు వినియోగించినా కరెంట్ చార్జ్ ప్రకారం మీ కార్డ్ డిలీట్ అవుతుంది.ముఖ్యంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా రేషన్ తొలగించారు.

అలాగే రేషన్ పై కేంద్రం తీసుకువచ్చిన రూల్ ఏమిటి అంటే, వచ్చే ఏడాది జూన్ 1 నుంచి రేషన్ కార్డును దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకోవచ్చని తెలిపింది.ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుతో దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరుకులు తీసుకోవచ్చని తెలిపింది కేంద్రం..దీనికి కొత్త కార్డులు జారీ ఏమీ లేదు అని తెలిపారు అధికారులు.