పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. బాహుబలితో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా తన మార్క్ చాటుకున్న డార్లింగ్..సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలతో తన స్టామినా చాటుకున్నారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్-కే వంటి సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది.
ఇటీవల జరిగిన ‘సలార్’ సినిమా షూటింగ్లో ప్రభాస్ గాయపడ్డారు. దీనితో ఆయన స్పెయిన్ వెళ్లి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తుంది. చిన్నపాటి ఆపరేషనే అయినా డాక్టర్లు.. ప్రభాస్‌ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇక, ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్‌లో ప్రీమియర్ షోకి డార్లింగ్ ప్రభాస్ వస్తారా? అని రాజమౌళిని ఎన్టీఆర్‌ను అడిగారు. సమాధానంగా “ప్రభాస్ కదిలి ప్రీమియర్‌కు రావడం.. అది జరిగే పని కాదు” అని రాజమౌళి అన్నారు. అయితే ప్రభాస్ సర్జరీ చేయించుకోవడం వల్లే రావట్లేదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.