ఊర మాస్‌ అవతారంలో వైష్ణవ్ తేజ్.. ‘ఆదికేశవ’ ట్రైలర్ విడుదల మెగా హీరో

-

Aadikeshava Movie | మెగా హీర వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’ ట్రైలర్ విడుదలైంది. రొమాన్స్, యాక్షన్‌తో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత క్రేజ్ పెంచుతుంది.

- Advertisement -

Aadikeshava Movie | ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్‌గా నటించాడు. సీనియర్ హీరోయిన్ రాధిక, అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రల్లో నటించగా.. శ్రీలీల హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. వైష్ణవ్ తేజుని లవర్ బాయ్‌గా, యాక్షన్ సీక్వెన్స్‌లో ఊర మాస్‌గా ఇందులో చూపించారు. మొత్తానికి ట్రైలర్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన మూవీ రిలీజ్ కానుంది.

Read Also: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.....