Venu Thottempudi | హీరో వేణు ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత..

-

సీనియర్ హీరో, నటుడు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకటసుబ్బారావు(92) కన్నుమూశారు. వయోభారం, వృద్ద్యాప్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ప్రముఖుల సందర్శనార్ధం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్ వారి స్వగృహంలో ఉంచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కల్యాణరాముడు, చెప్పవే చిరుగాలి, శ్రీకృష్ణ 2006, గోపి గోపిక గోదావరి వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దమ్ము’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇటీవల రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ద్వారా వేణు(Venu Thottempudi) మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓటీటీలో ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించాడు.

Read Also: అతి శుభ్రత అనారోగ్యానికి దారితీస్తుందా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...