Venkatesh | హీరోలు వెంకటేశ్, రానాలపై పోలీస్ కేసుకు కోర్టు ఆదేశాలు

-

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్‌(Venkatesh) కుటుంబసభ్యులకు నాంపల్లి కోర్టు(Nampally Court) గట్టి షాక్ ఇచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని నందకుమార్ అనే వ్యక్తి దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశాడు. లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. బిల్డింగ్‌ను అక్రమంగా కూల్చేసి, ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, 60 మంది ప్రైవేట్ బౌన్సర్ల సహాయంతో హోటల్‌ను కూల్చేశారని వాపోయారు.

- Advertisement -

దీని వల్ల తనకు రూ.20కోట్ల నష్టం వాటిల్లిందని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంకటేశ్(Venkatesh), ఆయన సోదరుడు సురేశ్ బాబు(Suresh Babu), రానా(Rana), అభిరామ్‌(Abhiram)లపై ఐపీసీ సెక్షన్ 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారందరిపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధం అయ్యారు.

Read Also: హీరో వేణు ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన తండ్రి కన్నుమూత..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...