బాలయ్య కొత్త మూవీకి హీరోయిన్ ఫిక్స్

Heroine fix for Balayya's new movie

0
43

నందమూరి బాలకృష్ణకు కొత్త హీరోయిన్ దొరికేసింది. ఆయన హీరోగా చేయబోయే కొత్త సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని దీపావళి సందర్భంగా ప్రకటించారు. పోస్టర్​ను కూడా విడుదల చేశారు. అయితే నిజ జీవిత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గోపీచంద్ ఇంతకు ముందు తీసిన ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాల్లో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటించింది. దీంతో ఆమెను మరోసారి తన సినిమా కోసం ఎంపిక చేశారు.

మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అఖండ’. తాజాగా దీపావళి పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ సాంగ్ టీజర్ ​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ నెల 8న పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు.