ప్రెగ్నెన్సీపై స్పందించిన హీరోయిన్ కాజల్​

Heroine Kajal responds to pregnancy

0
98

గతేడాది అక్టోబరులో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న స్టార్​ హీరోయిన్​ కాజల్.. ప్రస్తుతం గర్భంతో ఉందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విషయమై స్పందించిన ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సరైన సమయంలో దీని గురించి స్పందిస్తా అని చెప్పింది. త్వరలోనే కాజల్.. చిరంజీవి నటించిన​ ‘ఆచార్య’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే ‘హే సినామికా’, ‘ఘోష్టి’, ‘ఉమ’, ‘ఇండియన్​ 2’, ‘ప్యారిస్​ ప్యారిస్​’ సినిమాల్లో నటిస్తోంది.

కాజల్​ చెల్లిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని చిత్రాల్లో నటించిన నిషా అగర్వాల్ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్​బై చెప్పింది. ఆమెకు ఓ అబ్బాయి. అయితే కాజల్ కూడా​ త్వరగా తల్లి అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తెలిపింది నిషా.

తల్లిగా మారడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఆ దశలో సెల్ఫ్​ రియలైజేషన్​ అవుతారని అనుకుంటా. అయినా నిషా కుమారుడుతో ఉన్నప్పుడు నన్ను నేను ఓ తల్లిగా భావిస్తా. ఇప్పుడు మా ఇంట్లో మియా (పెంపుడు కుక్క) వచ్చాక కూడా.. నేను, గౌతమ్​ తల్లిదండ్రులుగా ఫీల్​ అవుతున్నాం. నాకు సొంత పిల్లలు పుట్టినప్పుడు ఈ ఎమోషన్​ ఇంకా ఎక్కువ అవుతుందనుకుంటా” అని కాజల్​ చెప్పింది.