Chandramukhi 2 | చంద్రముఖి-2 అప్డేట్: అదిరిపోయిన హీరోయిన్ లుక్

-

రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2(Chandramukhi 2)’. పి.వాసు దర్శకుడు. రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా.. అభిమానులను ఆకట్టుకుంది. రాజు వేషంలో రాజసం, పొగరుతో పాటు క్రూరత్వం కలబోసిన పాత్రలో ఆయన కనిపిస్తున్నారు.

- Advertisement -

Chandramukhi 2

తాజాగా.. హీరోయిన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అమాయకమైన ముఖంతో అందం, అభినయం కలబోసిన లుక్‌లో కంగన కనువిందు చేస్తోంది. వచ్చే వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. “చంద్రముఖి’ చిత్రం హారర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇది కూడా అదే తరహాలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Read Also: పెళ్లిపై మిల్కీ బ్యూటీ తమన్నా క్లారిటీ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...