Heroine Meena clarity on her second marriage rumours: ఇటీవలే మీనా భర్త చనిపోవటంతో.. తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆమె.. ఇప్పుడిప్పుడే ఆ బాధలో నుంచి బయటకు వస్తోంది. ఇంతలోనే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందనీ.. సమీప బంధువునే మనువాడబోతుందంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన మీనా, స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. “బుద్ది ఉందా.. డబ్బు కోసం ఏదైనా చేస్తారా..? ఎవరు చెప్పారు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాని.. సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతుంది. నిజనిజాలు తెలుసుకొని రాయండి.. దిగజారి ప్రవర్తించకండి.. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు ప్రచారాలు వచ్చాయి. అవి ఇప్పటికీ ఆగలేదు.. ఇలాంటి వార్తలు పుట్టించే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ స్థాయిలో మీనా ఎప్పుడూ కోప్పడింది లేదనీ.. ఈ వార్తలు ఎంత బాధపెట్టి ఉంటే ఆమె ఇంతలా స్పందించి ఉంటుందని అభిమానులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ఆపండంటూ మండిపడుతున్నారు. మీనా (Heroine Meena) తాజా వ్యాఖ్యలతో ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.