బాహుబలి సీన్‌కి ఫిదా అయిన హాలీవుడ్‌ డైరెక్టర్

బాహుబలి సీన్‌కి ఫిదా అయిన హాలీవుడ్‌ డైరెక్టర్

0
40

అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన ‘బాహుబలి’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా గుర్తుచేసుకుంటున్నవారున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్కాట్‌ డెరిక్సన్‌ ఈ సినిమా గురించి తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమా చివరి భాగంలో ప్రభాస్‌, సత్యరాజ్‌తో పాటు మరికొందరు సైనికులుచెట్టుపై నుంచి ఎగిరిపడే సన్నివేశం గుర్తుందా? అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి సన్నివేశాన్ని తానెప్పుడూ చూడలేదంటూ ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన వీడియోను స్కాట్‌ డెరిక్సన్‌ చూశారు. ఆయన కూడా ఈ సన్నివేశాన్ని వీక్షించారు. ‘ఇండియన్‌ బాహుబలి 2’ అని ఆయన క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లంతా ‘బాహుబలి’ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ సిరీస్‌కు స్కాట్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ నుంచి మరో సినిమా రాబోతోంది. సినిమాకు ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.