Review: శర్వా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎలా ఉందంటే?

0
113

శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ తోనే మార్కులు కొట్టేశారు డైరెక్టర్ తిరుమల కిషోర్. తాజాగా ఈ సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షలకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్స్ గురించి చెప్పే చిత్రమే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. చిరంజీవి అలియాస్‌ చిరు (శర్వానంద్‌)ది పెద్ద ఫ్యామిలీ. తన తల్లి (రాధిక)తో పాటు, ఆమె తోబుట్టువులు నలుగురు (ఊర్వశి, కల్యాణీ నటరాజన్‌, రాజశ్రీ నాయర్‌, సత్య కృష్ణన్‌) చిరుని గారాబంగా పెంచుతారు. చిరంజీవికి మంచి అమ్మాయిని చూడాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి సంబంధానికీ వంక పెడతారు. దాంతో చిరుకి చిరాకు వస్తుంది. అనుకోకుండా అతనికి ఆద్య (రష్మిక) పరిచయమవుతుంది. ఆమె మీద ప్రేమను పెంచుకుంటాడు. ఇంట్లో వాళ్లతోనూ అదే విషయం చెబుతాడు. చిరు అంటే ఆద్యకి సదభిప్రాయం ఉన్నప్పటికీ, తన తల్లి (ఖుష్బూ)… తనకు పెళ్లి చేసే ఆలోచనలో లేదని గట్టిగా చెబుతుంది. దానికి రీజన్‌ ఏంటి? ఆద్య తల్లి వకుళతో కలిసి పనిచేసే సరిత విషయంలో ఏం జరిగింది? పెళ్లి అంటే వాళ్ల ఫ్యామిలీకి పడదా? ఇంతమందిని ఒప్పించి చిరు, ఆద్య పెళ్లి చేసుకున్నారా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

టైటిల్‌కి తగ్గట్టుగానే ఇంటి నిండా ఆడవాళ్లు, వాళ్లందరికీ నచ్చితేగానీ ఏ పనీ చేయని హీరో… ఇలా సాగుతుంది ఆడవాళ్లు మీకు జోహార్లు. అంత మంది ఆడవాళ్ల మధ్య నలిగిపోయే కుర్రాడిలా శర్వానంద్‌ నటన, అలాగే రష్మిక నటన బాగుంది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సత్యకృష్ణన్‌ ఎవరి పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు. వెన్నెలకిశోర్‌ కామెడీ, ఊర్వశి స్టీల్‌ డబ్బా కామెడీ, బ్రహ్మానందం రైల్వే స్టేషన్‌ పెళ్లిచూపులు నవ్వించాయి. దేవిశ్రీ పాటలు, నేపథ్య సంగీతం బావుంది. అందరికీ తెలిసిన కథ. అనూహ్యమైన ట్విస్టులు లేకపోవడంతో కథ సాదాసీదాగా సాగినట్టు అనిపించింది. భావోద్వేగాలను ఇంకాస్త బలంగా పలికించాల్సింది.

ప్లస్ పాయింట్స్:

డైలాగులు

బ్రహ్మానందం రైల్వే స్టేషన్‌ పెళ్లిచూపులు

వెన్నెలకిశోర్‌ కామెడీ

సుజిత్ సారంగ్ కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్:

కథలో కొత్తదనం లేకపోవడం

కథనం

ఎమోషన్స్

రేటింగ్: 2.5/5