అలియా ‘ఆల్ఫా’లో మరో స్టార్ హీరో! ఎవరో తెలుసా..?

-

Alpha Movie | బాలీవుడ్ భామ అలియా భట్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం అలియా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. శివ్ రవైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘ఆల్ఫా’ అన్న పేరును ఫైనల్ చేశారు. ఇందులో శార్వారీ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అలియా యాక్షన్ ఎపిసోడ్స్ ఔరా అనిపిస్తాయిన మూవీ టీమ్ చెప్పకనే చెప్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. ప్రస్తుతం చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, ఈ సన్నివేశాలు సినిమాకు చాలా కీ పాయింట్స్ కానున్నాయని మూవీ టీం నుంచి అందుతున్న సమాచారం. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ విషయం కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఈ ప్రచారంతోనే ఈ సినిమాపై అంచనాలు అంతకంతా పెరుగుతున్నాయి.

- Advertisement -

అదేంటంటే.. అలియా సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనుండటం. అది కూడా అతిథి పాత్రలో. అతడే గ్రీక్ గాడ్‌గా పేరొందిన బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan). హృతిక్ సీన్స్ కూడా కశ్మీర్ షెడ్యూల్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో అలియా(Alia Bhatt), హృతిక్ కలిసి యాక్షన్ సీన్స్‌లో పాల్గొననున్నారని, ఈ సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను సీట్ ఎడ్జెస్‌లో కూర్చోబెట్టడం ఖాయమని మూవీ(Alpha Movie) టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉందని తెలుస్తోంది. మరి హృతిక్ కేమియో గురించి అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఈ విషయం చెప్తారా లేకుంటే వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో వచ్చేవరకు సర్‌ప్రైజ్‌గానే ఉంచుతారా అనేది చూడాల్సి ఉంది.

Read Also: చికెన్ ఇలా తింటే ఆరోగ్యం.. అలా తింటే అనారోగ్యం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...