నాకు ఎటువంటి భాగస్వామి కావాలో స్పష్టత ఉంది: సీతారామం బ్యూటీ

-

ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్లు అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన హీరోయిన్‌ లిస్టులో మృణాల్‌ ఠాకూర్‌ చేరారు. సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి మృణాల్‌ ఉత్తరాది అమ్మాయి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి, ప్రేక్షకులను మెప్పించింది. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌, ప్రేమ, పెళ్లి, వయస్సుపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. తన వయస్సు 30 అని చెప్పగానే అందరూ పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారని, అటువంటి వారి నుంచి దూరంగా ఉంటున్నట్లు మృణాల్‌ వివరించింది. 20 ఏళ్ల వయస్సులో పుట్టే ప్రేమకు, 30 ఏళ్ల వయస్సులో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. 20 ఏళ్లలో ప్రాథమిక విషయాల గురించి పట్టించుకోరనీ.. 30 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని ప్రేమించాలనీ, అతను మనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటామని మృణాల్‌ తెలిపింది. 30 ఏళ్ల నాటికి తన భాగస్వామి నుంచి ఏమి కోరుకోవాలి.. ఏమి ఆశించాలన్న అంశాలపై తనకు స్పష్టత వచ్చిందని ఈ ముద్దుగుమ్మ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...