‘ఐ లవ్​ మై గవర్నమెంట్: హీరో విజయ్ దేవరకొండ

'I love Telangana government: Hero Vijay Devarakonda

0
255

తెలంగాణ గవర్నమెంట్​పై యువ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం కురిపించారు. టికెట్ల రేట్ల విషయంపై స్పందించిన ఆయన తెలంగాణ సర్కార్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్..తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాడు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్​కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని అన్నారు. టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా విజయ్ అభిమానులతో పంచుకున్నారు.