టాలీవుడ్ లో అందాల తారగా రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి ఫేమ్ ఉంది, అందం అభినయంతో పాటు మంచి ఫిటినెస్ మెయింటైన్ చేస్తుంది, టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు హీరోలతో ఆమె మంచి ఫ్రెండ్ షిప్ కలిగి ఉంటుంది, అయితే రకుల్ జిమ్ లోవర్క్ అవుట్లతో ఎక్కువసేపు గడుపుతుంది. ఓ పక్క యంగ్ హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది.
అయితే తాజాగా ఈ రకుల్ బేబీ తన వివాహం గురించి తనకు కాబోయే వాడి గురించి పలు విషయాలు చెప్పింది,
తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉందని, తనకు కాబోయే భర్తకు ఈ జీవితం పట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలని చెప్పింది.సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చానని తనకు అలాంటి వ్యక్తి కావాలి అని తెలిపింది.
తన తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేసిన కారణంతో తాను అందుకు సంబంధించిన వాతావరణంలోనే పెరిగానని తెలిపింది. మంచి ఆరోగ్యం మంచి జీవనశైలిని పాటించే వారిని చేసుకుంటాను అని తెలిపింది రకుల్ … తాను బీచ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. మొత్తానికి ఆమె అభిమానుల మాత్రం ఈ మాట విని ఆమెకి మద్దుతుగా కామెంట్లు పెడుతున్నారు.