క్యాన్సర్ వ్యాధిపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను క్యాన్సర్ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భయం లేదని చెప్పారు. ఏఐజీలో కొలనోస్కోపీ చేయించుకొని క్యాన్సర్ నుంచి బయటపడ్డానన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని చిరంజీవి శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన క్యాన్సర్ బారినపడిన విషయాన్ని రివీల్ చేశారు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద జబ్బేం కాదని తెలిపారు.