ఇకపై రొమాన్స్ సీన్లలో నటించను..లేడీ సూపర్ స్టార్ సంచలన నిర్ణయం

0
120

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకొని..ఎట్టకేలకు వీరి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి మూడుముళ్ల బంధంతో అడుగుపెట్టారు. సన్నిహితులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జూన్ 9వ తేదీన వీరిద్దరి వివాహం షెరటాన్ పార్క్ గ్రాండ్ హోటల్ మహాబలిపురంలో జరిగిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా నయనతార సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వివాహము జరగకముందు అన్ని సీన్లలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పటినుండి రొమాన్స్ సీన్లలో నటించానని, కేవలం సబ్జెక్టు ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. అలాగే ఎక్కువ డేట్స్ కూడా ఇవ్వనని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.