ఇండియాలో iBOMMA షట్ డౌన్..ఈ సంచలన నిర్ణయం వెనక కారణం ఇదేనా!!

0
93

iBOMMA యూజర్లకు బిగ్ షాకిచ్చింది. 9-9–2022 నుండి ఇండియాలో తమ ఆపరేషన్లు పూర్తిగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ తిరిగి వచ్చే ఆలోచన లేదు. ఎవరూ కూడా మెయిల్స్ చేయొద్దని సూచించింది. అందుకు అనుగుణంగానే నేటి నుండి ఇండియాలో ఐబొమ్మ సేవలు నిలిచిపోయాయి. అయితే దీనికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

కాగా ఐబొమ్మలో కొత్త సినిమాను హైక్వాలిటీతో చూడొచ్చు. దీనితో ఓటిటి సుబ్స్క్రిప్షన్, చార్జీలు లేకుండా సినిమాలు వీక్షించవచ్చు అన్నమాట. అందుకే తక్కువ కాలంలో iBomma యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. కానీ కొన్ని రోజులకే  iBomma ను షట్ డౌన్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో యూజర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అయితే ఐబొమ్మ సంచలన నిర్ణయం వెనక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఐబొమ్మ పై వస్తున్న నెగెటివ్ ట్రోలింగ్., సర్వర్ కాస్ట్, ఓటీటీ జెయింట్స్ నుంచి వస్తున్న ఒత్తిడే కారణం అంటూ.. ప్రాథమికంగా తేల్చారు. అందుకే ఐబొమ్మ ఇండియాకు గుడ్‌ బై చెప్పింది కావచ్చు అంటూ.. నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.