కొత్తలుక్ తో ఆకట్టుకుంటున్న పవన్…హరిహర వీరమల్లు పోస్టర్ రిలీజ్

0
100

‘భీమ్లా నాయక్’ సినిమాతో మంచి విశేషప్రేక్షాధారణ  సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా చాలాసార్లు షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ శ్రీరామనవమి సందర్బంగా చిత్రబృందం ఈ మూవీ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో పవన్ డిఫరెంట్ గెటప్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ ఓ యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.