ఎఫ్3 మూవీ చూసిన బాలయ్య.. ఎలా స్పందించాడంటే?

0
110

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్3 ని అనిల్ రావిపూడి తెరెకెక్కించి భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేసింది.  అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించి ఆనందపడడమే కాకుండా..అనిల్ రావిపూడితో కలిసి బాలయ్య హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు.

ఈ సినిమా చూసిన అనంతరం బాలయ్య ఎలా స్పందించాడంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలియజేయడంతో పాటు..కామెడీ టైమింగ్ కూడా బాగుందని మెచ్చుకున్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించి కడుపుబ్బా నవ్వించాలనే కారణంతో అనిల్ రావిపూడి చక్కగా తెరకెక్కించారని బాలయ్య ప్రశంసల వర్షం కురిపించాడు.